HeadLines

bb
 • Page Views 1626

బాల‌య్య‌పై దిమ్మ‌తిరిగే క‌మెంట్స్ చేసిన తార‌క్‌..!

గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి.. మొన్న‌టి వ‌ర‌కూ ఎటువంటి ఆడంబ‌రాలు లేకుండా చాలా సైలెంట్‌గా షూటింగ్ జ‌రుపుకున్న ఈ చిత్రం ఇప్పుడు సెన్సేష‌న్‌గా మారిపోయింది. నిన్న విడుద‌ల ఈ చిత్ర ట్రైల‌ర్ ప్ర‌స్తుతం సోష‌ల్‌మీడియాను షేక్ చేసి పారేస్తుంది. బాల‌య్య రాజ‌సం, అద్బుత‌మైన డైలాగ్స్ ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్‌తో క‌ల‌బోసిన ఈ ట్రైల‌ర్ ఇప్ప‌టివ‌ర‌కూ 20ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్‌ను సంపాదించుకోవ‌టం గ‌మ‌నార్హం.

                         ఇదిలావుంటే, ఈ ట్రైల‌ర్ చేసిన సంచ‌ల‌నం ఒక ఎత్తు అయితే, ఈ ట్రైల‌ర్‌పై జూనియ‌ర్ ఎన్టీఆర్ స్పందించిన విధానం మ‌రో ఎత్తు. గ‌త కొంత‌కాలంగా ఇండ‌స్ట్రీ ఇన్‌సైడ్ కానీ, ఔట్‌సైడ్ కానీ బాల‌య్య‌కు తార‌క్‌కు మ‌ధ్య ఎటువంటి సంబంధాలు లేవ‌న్న సంగ‌తి తెలిసిందే. ఒక‌రి ఫంక్ష‌న్‌కి మ‌రొక‌రు రాక‌పోవ‌టం, ఆడియో వేడుక‌లు , సినిమా ప్రారంభోత్స‌వాలు ఇలా దేనికీ క‌ల‌వ‌కపోవ‌టం అనేవి చాలా కామ‌న్‌గా మారిపోయాయి. అయితే వీరిద్ద‌రి మ‌ధ్య కోల్డ్ వార్ జ‌రుగుతుంద‌నే ఇండ‌స్ట్రీ గాసిప్‌లు చాలానే పుట్టుకొచ్చాయి. కానీ తార‌క్ ఈసారి ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా బాల‌య్య సినిమాపై స్పందించాడు.గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్ ఫినామినల్ .. బాబాయి తన బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు.. బాలయ్యను ఇంతకుముందెన్నడూ లేని విధంగా చూపించినందుకు క్రిష్ కు కుడోస్ అంటూ తార‌క్ స‌రికొత్తగా బాల‌య్య‌పై త‌న అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ మాట‌ల బ‌ట్టి చూస్తుంటే బాబాయ్ అంటే అబ్బాయికి ఎంత ప్రేమ ఉందో తెలిసిపోతుంది. అయితే మ‌రి ఇంత‌కాలం వీరిద్ద‌రి మ‌థ్య ఏవేవో గొడ‌వలున్నాయ‌న్న మాట‌లు ఇంత‌టితో ఆగుతాయో లేదో చూడాలి.

Share This Article

అప్పుడే ఫిక్స్ అయిన బాల‌య్య కొడుకు..నాగ‌బాబు కూతురు.

Next Story »

సుధీర్‌తో ఎఫైర్ మ్యాట‌ర్‌పై షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన ర‌ష్మీ..

Health

 • jama

  జామ పండ్లు, ఆకులు వ‌ల్ల ఊహించ‌ని ఉప‌యోగాలు ఇవే..

  1 year ago

  ప్ర‌స్తుత రోజుల్లో పెరిగిపోతున్న పొల్యూష‌న్‌తో పాటు సంపాద‌న క్ర‌మంలో చాలా మందికి తిండి తినే టైమ్ కూడా ఉండ‌టం లేదు.. దీనికార‌ణంగా చిన్న వ‌య‌సులోనే లేనిపోని రోగాలతో జీవితాన్ని కోల్పోతున్నారు. దీనంత‌టికి కార‌ణం మ‌నం తినే తిండిలో ...

  Read More
 • ff

  విదేశీప‌ళ్లు తింటే అయిపోయిన‌ట్లే..!

  2 years ago

  ప‌ళ్లు తింటే ఆరోగ్యం చ‌క్క‌గా ఉంటుంది..ఇది తెలియ‌ని విష‌యం కాదు..అయితే ఈ ఆరోగ్యం మ‌రింత చ‌క్క‌గా ఉండాల‌నే ఉద్దేశంతో విదేశీ దిగుమ‌తులుగా వ‌చ్చే ప‌ళ్ల‌ను తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు మ‌న దేశీయులు..విధేశాల నుండి దిగుమ‌తి అయ్యే ...

  Read More
 • nn

  నాచురల్ హెయిర్ కండిష‌న‌ర్‌.

  2 years ago

  ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రిని బాగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య జుట్టు.. ఈ స‌మ‌స్య ఒకొక్క‌రిలో ఒకో విధంగా ఉంటుంది. కొంద‌రికి జుట్టు రాలిపోవ‌టం, కొంద‌రికి ఎక్కువ‌గా చుండ్రు ప‌ట్ట‌టం, మ‌రి కొంద‌రికి జుట్టు డ్రైగా అయిపోవాటం ...

  Read More