HeadLines

rana
  • Page Views 7157

ప్ర‌భాస్ చ‌చ్చిపోతాడ‌నుకున్నా..! షాకిచ్చిన రానా.!

బాహుబ‌లి.. ప్ర‌స్తుతం మొత్తం ప్ర‌పంచాన్ని ఉత్కంఠ‌కు గురిచేస్తున్న భారీ విజువ‌ల్ వండ‌ర్ సినిమా. టాలీవుడ్ స్ధాయిని హాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేసి, అంత‌టా ఊహించని పాపులారిటీ ద‌క్కించుకున్న చిత్రం ఇది. ప్ర‌భాస్‌, రానా ప్ర‌ధాన పాత్ర‌లుగా తెర‌కెక్కిన ఈ చిత్రం ఎంత‌టి ఘ‌న‌విజ‌యాన్ని ద‌క్కించుకుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లెద్దు.

                                         అయితే బాహుబ‌లి జ‌స్ట్ బిగినింగ్ మాత్ర‌మే, ఇప్పుడు విడుద‌ల‌కు సిద్దంగా ఉన్న బాహుబ‌లి ది క‌న్‌క్లూజ‌న్ పార్ట్ మొద‌టి పార్ట్‌కంటే రెండురెట్లు ఎక్కువ ఆశ‌క్తిగా ఉంటుంది. ఇది మేము చెబుతున్న మాట కాదు. బాహుబ‌లి టీమ్ ప్ర‌తీ ఒక్క‌రినోట వినిపిస్తున్న మాట ఇదే. అయితే ఈ మాట‌లు మ‌రింత హైప్ తెచ్చిపెట్టాయ్ రానా మాట‌లు. బాహుబ‌లి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా జ‌రిగిన ఇంట‌ర్వ్యూలో రానా దిమ్మ‌తిరిగిపోయే న్యూస్ లీక్ చేశాడు. ” బాహుబ‌లి-2కి ప్రధాన ఆక‌ర్ష‌న ప్ర‌భాస్‌, రానాల ఫైట్‌.. ఈ ఫైట్ గురించి రాజ‌మౌళిగారు మాతో చెప్ప‌గానే నేను షాకైపోయాను. ఆయ‌న ఆలోచ‌న‌లు ఒకొక్క‌టిగా బ‌య‌ట‌పెడుతుంటే నాలో భ‌యం క‌లిగింది. ఈ ఫైట్ సీన్స్ ఫినిష్ అయ్యేలోగా నేను , ప్ర‌భాస్‌ల‌లో ఎవ‌రో ఒక‌రు మాత్ర‌మే బ్ర‌తికుంటాం అన్నంత భ‌య‌మేసింది ” అంటూ రానా చెప్పాడు. ట్రైల‌ర్‌లో ఈ ఫైట్ సీన్స్ చూసి ఆశ్చ‌ర్యానికి గురైన ఆడియ‌న్స్‌కు ఇప్పుడు రానా మాట‌లు మ‌రింత ఆశ్చ‌ర్యం క‌లిగిస్తున్నాయి. ఏది ఏమైన బాహుబ‌లి-2 ఈ వేసవికాలాన్ని మ‌రింత వేడెక్కించ‌టం గ్యారెంటీ అని అర్ద‌మౌతుంది.

Share This Article

అమె రేటు ఆరునిమిషాల‌కి కోటి రూపాయ‌లు.!

Next Story »

ఆ స్టార్‌హీరో న‌న్ను గ‌దిలోకి ర‌మ్మ‌న్నాడు – షాకిచ్చిన మ‌రో స్టార్‌హీరోయిన్‌.

Health

  • jama

    జామ పండ్లు, ఆకులు వ‌ల్ల ఊహించ‌ని ఉప‌యోగాలు ఇవే..

    1 year ago

    ప్ర‌స్తుత రోజుల్లో పెరిగిపోతున్న పొల్యూష‌న్‌తో పాటు సంపాద‌న క్ర‌మంలో చాలా మందికి తిండి తినే టైమ్ కూడా ఉండ‌టం లేదు.. దీనికార‌ణంగా చిన్న వ‌య‌సులోనే లేనిపోని రోగాలతో జీవితాన్ని కోల్పోతున్నారు. దీనంత‌టికి కార‌ణం మ‌నం తినే తిండిలో ...

    Read More
  • ff

    విదేశీప‌ళ్లు తింటే అయిపోయిన‌ట్లే..!

    2 years ago

    ప‌ళ్లు తింటే ఆరోగ్యం చ‌క్క‌గా ఉంటుంది..ఇది తెలియ‌ని విష‌యం కాదు..అయితే ఈ ఆరోగ్యం మ‌రింత చ‌క్క‌గా ఉండాల‌నే ఉద్దేశంతో విదేశీ దిగుమ‌తులుగా వ‌చ్చే ప‌ళ్ల‌ను తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు మ‌న దేశీయులు..విధేశాల నుండి దిగుమ‌తి అయ్యే ...

    Read More
  • nn

    నాచురల్ హెయిర్ కండిష‌న‌ర్‌.

    2 years ago

    ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రిని బాగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య జుట్టు.. ఈ స‌మ‌స్య ఒకొక్క‌రిలో ఒకో విధంగా ఉంటుంది. కొంద‌రికి జుట్టు రాలిపోవ‌టం, కొంద‌రికి ఎక్కువ‌గా చుండ్రు ప‌ట్ట‌టం, మ‌రి కొంద‌రికి జుట్టు డ్రైగా అయిపోవాటం ...

    Read More