HeadLines

remu
 • Page Views 3571

బాహుబ‌లి – న‌టీన‌టుల రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..?

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ ఖ్యాతిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన అత్యంత భారీ చిత్రం బాహుబ‌లి. ఇండ‌స్ట్రీ పెద్ద‌లు సైతం కంగుతినే విధంగా రికార్డ్ స్థాయి క‌ల‌క్ష‌న్లు రాబ‌డుతున్న ఈ చిత్రం ఇప్పుడు టాక్ ఆఫ్ ది నేష‌న్‌గా మారిపోయింది. ప్ర‌పంచ దేశాల్లో తెలుగువాడి స‌త్తా చాటి చెబుతున్న ఈ చిత్రం అనుకున్న విధంగా రూపుదిద్దుకోటానికి ఎంతో మంది న‌టీన‌టులు , టెక్నీషియ‌న్స్ క‌ష్ట‌ప‌డ్డారు.

                                          అయితే ఈ చిత్రంలో న‌టించిన చాలా మంది ఈ సినిమాకు కీల‌కంశంగా మారారు. ఇంత భారీ ప్రాజెక్ట్‌లో పాలుపంచుకున్న కొంద‌రి న‌టీన‌టుల రెమ్యున‌రేష‌న్ వివ‌రాలు ఇలా ఉన్నాయి..

1- తెలుగు సినిమా రేంజ్‌ను హాలీవుడ్ స్థాయిలో చూపించిన ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, బాహుబ‌లి సినిమా ద్వారా 28కోట్ల రూపాయ‌లు అందుకున్నార‌నే టాక్ వినిపిస్తుంది.
2- బాహుబ‌లి పాత్ర‌కు త‌ను త‌ప్ప మరే హీరో స‌రిపోడ‌న్నంత‌గా న‌టించిన హీరో ప్ర‌భాస్‌.. కెరియ‌ర్ పీక్ స్టేజ్‌లో ఉన్న స‌మ‌యంలో బాహుబ‌లి కోసం త‌న ఐదేళ్ళ కెరియ‌ర్ వదులుకున్న ప్ర‌భాస్‌కు ఈ సినిమా ద్వారా 25కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ ద‌క్కింద‌ట‌.
3-ఓ ప‌క్క స్టార్ హీరోగా ఎదుగుతూ, మ‌రో ప‌క్క‌ విల‌నిజాన్ని ఆశ్చ‌ర్య‌క‌ర రీతిలో పండించిన భ‌ళ్లాల‌దేవుడు రానా బాహుబ‌లి సినిమాకి అత్యంత అవ‌స‌ర‌మైన వ్య‌క్తి. మంచిత‌నంతో వంచించ‌టం, చేసే త‌ప్పుని అత్యంత క్రూరంగా ప్ర‌ద‌ర్శించ‌టంలో రానా చాలా హైలెట్‌గా నిలిచాడు. బాహుబ‌లి సినిమా ద్వారా రానాకి ద‌క్కిన రెమ్యున‌రేష‌న్ 15కోట్లు.
4-ఇటు అంద‌మైన‌ యువ‌రాణిగా, అటు అంద‌విహీన‌మైన బంధీగా ఒకేసారి త‌న‌లోని న‌ట‌న‌కు ప్రాణంపోసి ప్ర‌ద‌ర్శించిన దేవ‌సేన అనుష్క‌కు ఈ సినిమా ద్వారా ద‌క్కిన రెమ్యున‌రేష‌న్ 5కోట్లు.
5-దేవ‌సేన విడిపించేందుకు త‌న అందాన్ని, ఆడ‌త‌నాన్ని, జీవితాన్ని త్యాగం చేసి నిరంతరం శ్ర‌మించే అవంతిక త‌మ‌న్నాకి బాహుబ‌లి అందించిన రెమ్యున‌రేష‌న్ 5కోట్లు.
6- రాజ‌మాత‌గా, క‌న్న‌త‌ల్లిగా, మాయిష్మ‌తి రాజ్య యోగ‌క్షేమాల‌కు భంగం క‌ల‌గ‌కుండా నిరంతం శ్ర‌మించే శివ‌గామినిదేవి ర‌మ్య‌కృష్ణ‌కు 2కోట్లు.
7-ఇచ్చిన మాట త‌ప్ప‌ని బానిస‌త్వానికి ప్ర‌త్యేక నిద‌ర్శ‌నం క‌ట్ట‌ప్ప స‌త్య‌రాజ్‌కు 2కోట్లు.

Share This Article

బాహుబ‌లి ఎఫెక్ట్ : రాజ‌మౌళి సంపాద‌న ఎంతో తెలిస్తే షాకే..?

Next Story »

షాకింగ్ : సెక్స్‌కు బానిసైన స్టార్ హీరో..

Health

 • jama

  జామ పండ్లు, ఆకులు వ‌ల్ల ఊహించ‌ని ఉప‌యోగాలు ఇవే..

  1 year ago

  ప్ర‌స్తుత రోజుల్లో పెరిగిపోతున్న పొల్యూష‌న్‌తో పాటు సంపాద‌న క్ర‌మంలో చాలా మందికి తిండి తినే టైమ్ కూడా ఉండ‌టం లేదు.. దీనికార‌ణంగా చిన్న వ‌య‌సులోనే లేనిపోని రోగాలతో జీవితాన్ని కోల్పోతున్నారు. దీనంత‌టికి కార‌ణం మ‌నం తినే తిండిలో ...

  Read More
 • ff

  విదేశీప‌ళ్లు తింటే అయిపోయిన‌ట్లే..!

  2 years ago

  ప‌ళ్లు తింటే ఆరోగ్యం చ‌క్క‌గా ఉంటుంది..ఇది తెలియ‌ని విష‌యం కాదు..అయితే ఈ ఆరోగ్యం మ‌రింత చ‌క్క‌గా ఉండాల‌నే ఉద్దేశంతో విదేశీ దిగుమ‌తులుగా వ‌చ్చే ప‌ళ్ల‌ను తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు మ‌న దేశీయులు..విధేశాల నుండి దిగుమ‌తి అయ్యే ...

  Read More
 • nn

  నాచురల్ హెయిర్ కండిష‌న‌ర్‌.

  2 years ago

  ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రిని బాగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య జుట్టు.. ఈ స‌మ‌స్య ఒకొక్క‌రిలో ఒకో విధంగా ఉంటుంది. కొంద‌రికి జుట్టు రాలిపోవ‌టం, కొంద‌రికి ఎక్కువ‌గా చుండ్రు ప‌ట్ట‌టం, మ‌రి కొంద‌రికి జుట్టు డ్రైగా అయిపోవాటం ...

  Read More