HeadLines

varmaa
 • Page Views 5588

వంగ‌వీటి రాధాకు దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చిన వ‌ర్మ‌..” బ‌స్తీమే స‌వాల్ “

వంగ‌వీటి.. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ ప్ర‌జ‌ల‌లో సంచ‌ల‌నంగా మారిన పేరు. వంగ‌వీటి రాధ , వంగ‌వీటి మోహన రంగాల హ‌త్య‌ల‌కు గ‌ల కార‌ణాలను అత్యంత క్రూరంగా తెర‌కెక్కించిన వ‌ర్మ‌కు ఇప్పుడు విజ‌య‌వాడ నుండి కొత్త స‌వాల్‌లు ఎదుర‌వుతున్నాయ్‌. ఈ క్ర‌మంలో వ‌ర్మ‌పై విరుచుకుప‌డ్డాడు వంగ‌వీటి మోహ‌న రంగ త‌న‌యుడు వంగ‌వీటి రాధ‌. ఇప్ప‌టికే గ‌త మూడు రోజులుగా వంగ‌వీటి సెగ‌లో చ‌లికాచుకుంటున్న వ‌ర్మ ప్ర‌స్తుతం వంగ‌వీటి రాధాకు ఊహించ‌ని స‌వాల్ విసిరాడు..

1. రంగా గారు బోసిపళ్ళ మహాత్మా గాంధీ అని చూపించాలా?

2. మర్డర్ల మాట అటుంచి ఎవర్ని మొట్టికాయ కూడా కొట్టలేదని చూపించాలా?

3. మదర్ థెరిస్సా కన్నా సాత్వికుడు అని చూపించాలా?

4. అన్న దానాలు – ప్రజా సేవ తప్ప చీమకైనా హాని చెయ్యని గౌతమ బుద్దుడని చూపించాలా?
                   అంటూ త‌న‌దైన శైలిలో రాధ‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించాడు. ఇక ఈ విష‌యంపై మాట్లాడుతూ ‘‘రంగా గారి గురించి.. ఆయన భార్య గురించి.. రంగా గారి అభిమానులు వినడానికి చూడటానికి ఇష్టపడని డాక్యుమెంటేడ్ వాస్తవాలు నేను చాలా చూపించగలను. కానీ రంగా గారి మీద వున్న గౌరవంతో అవి చూపించలేదు. ఆ వాస్తవాలు ఏంటని రాధాకు దమ్ముండి డిమాండ్ చేస్తే వాటన్నింటిని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తా. వంగవీటి సినిమా తీయడంలో నా ఉద్దేశం ఆ జీవిత కథల ఆధారంగా అప్పుడు జరిగిన ఆ సంఘటనల వెనుక వాళ్ల సున్నితమైన భావోద్వేగాలని చూపించడం మాత్రమే. ఒరిజినల్ వంగవీటి రాధా – వంగవీటి రంగా గార్లలో ఉన్నగొప్పదనంలో ఈ రాధాకి 0.1% కూడా లేకపోవడం వల్లే ఈ రాధా పరిస్థితి ఇలా వుంది. ఏదీ అర్ధం చేసుకోకుండా మాట్లాడుతున్నాడు. వంగవీటి సినిమా గురించి దుర్భుద్ది ఉన్న వాళ్లు నా దురుద్దేశం గురించి ఎంత అరిచి గీపెట్టినా సరే.. రంగా గారి మీద రాధాకి – రత్నకుమారి గారికి ఉన్న గౌరవం కన్నా ఎన్నో రెట్లు నాకెక్కువ గౌరవముందన్నది వాస్తవం. నేను తీసిన ‘వంగవీటి’ సినిమా కరెక్ట్ కాదనుకుంటే రాధానే ‘అసలు వంగవీటి’ అనే ఇంకో సినిమా తీసి లోకానికి చూపించుకోమనండి’’ అన్నాడు వర్మ. ఇక వ‌ర్మ‌ను ఏంచేయాలో నాకు తెలుసు అంటూ రాధ ఇచ్చిన వార్నింగ్‌కు కౌంట‌ర్‌గా ‘‘బస్తీ మే సవాల్.. సెంటర్ నేను చెప్పను.. టైం నువ్వు చెప్పొద్దు’’ అంటూ ప్ర‌త్య‌క్ష స‌వాల్ విసిరాడు .

Share This Article

బ్రేకింగ్: బ‌య‌ట‌ప‌డ్డ క‌ట్ట‌ప్ప సీక్రెట్‌..బాహుబ‌లిని చంపింది క‌ట్ట‌ప్ప కాదు..ఎవ‌రో తెలిస్తే షాకే.!

Next Story »

బ్రేకింగ్ : బ్లూఫిల్మ్ మ్యాట‌ర్ గురించి రోజా బ‌య‌ట‌పెట్టిన షాకింగ్ విష‌యాలు.!

Health

 • jama

  జామ పండ్లు, ఆకులు వ‌ల్ల ఊహించ‌ని ఉప‌యోగాలు ఇవే..

  1 year ago

  ప్ర‌స్తుత రోజుల్లో పెరిగిపోతున్న పొల్యూష‌న్‌తో పాటు సంపాద‌న క్ర‌మంలో చాలా మందికి తిండి తినే టైమ్ కూడా ఉండ‌టం లేదు.. దీనికార‌ణంగా చిన్న వ‌య‌సులోనే లేనిపోని రోగాలతో జీవితాన్ని కోల్పోతున్నారు. దీనంత‌టికి కార‌ణం మ‌నం తినే తిండిలో ...

  Read More
 • ff

  విదేశీప‌ళ్లు తింటే అయిపోయిన‌ట్లే..!

  2 years ago

  ప‌ళ్లు తింటే ఆరోగ్యం చ‌క్క‌గా ఉంటుంది..ఇది తెలియ‌ని విష‌యం కాదు..అయితే ఈ ఆరోగ్యం మ‌రింత చ‌క్క‌గా ఉండాల‌నే ఉద్దేశంతో విదేశీ దిగుమ‌తులుగా వ‌చ్చే ప‌ళ్ల‌ను తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు మ‌న దేశీయులు..విధేశాల నుండి దిగుమ‌తి అయ్యే ...

  Read More
 • nn

  నాచురల్ హెయిర్ కండిష‌న‌ర్‌.

  2 years ago

  ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రిని బాగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య జుట్టు.. ఈ స‌మ‌స్య ఒకొక్క‌రిలో ఒకో విధంగా ఉంటుంది. కొంద‌రికి జుట్టు రాలిపోవ‌టం, కొంద‌రికి ఎక్కువ‌గా చుండ్రు ప‌ట్ట‌టం, మ‌రి కొంద‌రికి జుట్టు డ్రైగా అయిపోవాటం ...

  Read More