HeadLines

khadii
 • Page Views 8419

ఖైధీ నెం 150 మూవీ రివ్యూ & రేటింగ్‌

సినిమా                 : ఖైధీ నెం 150
ప్రొడ‌క్ష‌న్‌               : కొనెద‌ల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ
డిస్ట్రిబ్యూష‌న్           : ఎల్‌.వై.సి.ఎ. ప్రొడ‌క్ష‌న్‌
ప్రొడ్యూస‌ర్            : రామ్ చ‌ర‌ణ్
న‌టీన‌టులు            : మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్ అగ‌ర్వాల్ , శ్రీయ స‌ర‌న్‌
డైరెక్ట‌ర్                 : వి.వి.వినాయ‌క్‌
సంగీతం              : దేవిశ్రీ ప్ర‌సాద్‌
సినిమాటోగ్ర‌ఫీ        : ర‌త్న‌వేలు
ఎడిటింగ్              : గౌత‌మ్ రాజు
రిలీజ్ డేట్             : 11-01-2017

                                    దాదాపు ప‌దేళ్ల నిరీక్ష‌ణ త‌ర్వాత మెగా అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న చిత్రం ఖైధీ నెం 150. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, డైన‌మిక్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో అత్యంత భారీ అంచనాల న‌డుమ తెర‌కెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా ఈ రోజు థియేట‌ర్స్‌లో అడుగుపెట్టింది. ఎ.ఆర్‌.మురుగుదాస్ ద‌ర్శ‌కత్వంలో త‌మిళ‌నాట సంచ‌ల‌నం సృష్టించిన క‌థ ఆదారంగా తెర‌కెక్కిన ఈ చిత్రం ఇప్ప‌టికే అభిమానుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొల్పింది. పోస్ట‌ర్స్‌తో, సాంగ్స్ ప్ర‌మోష‌న్స్‌తో ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అక‌ట్టుకున్న ఈ సినిమా అభిమానుల అంచ‌నాల‌ను ఏమేర‌కూ అందుకుంద‌నేది www.manatelugutimes.com స‌మీక్ష ద్వారా తెలుసుకుందాం..

క‌థ :

అనంత‌పురం జిల్లా నీరూరు అనే గ్రామంలో ఈ క‌థ మొద‌లౌతుంది. అండ‌లేని సాగుభూముల‌ను న‌మ్ముకుని ఎన్నో నిరుపేద కుటుంబాలు జీవ‌నం సాగిస్తుంటాయి. అయితే ఈ భూములపై క‌న్నేసిన కార్పొరేట్ సంస్థ‌ల‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తూ అడ్డువ‌చ్చిన రైతుల‌ను చంపి వారి శ‌వాల‌తో వేలిముద్ర‌లు తీసుకుని భూములు ఆక్ర‌మిస్తుంటాడు అగ‌ర్వాల్. అయితే అగ‌ర్వాల్‌ని ప‌వ‌ర్‌తో ఈ విష‌యం వెలుగులోకి రాదు. ఈ విష‌యం వెలుగులోకి తీసుకువ‌చ్చేలా ఆరుగురు రైతులు లైవ్ వీడియో తీసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంటారు. ఈ ఘ‌ట‌న‌తో వెలుగులోకి వ‌చ్చిన ఈ స‌మ‌స్య గురించి అదె ఊరికి చెందిన కొణిదెల శివ‌శంక‌ర్ ప్ర‌సాద్ అలియాస్ శంక‌ర్ (చిరంజీవి) రైతుల త‌ర‌పున పోరాటం చేస్తుంటాడు. ఈ ఊరికి చెందిన కొంత మంది రైతుల‌ను హైద‌రాబాద్ తీసుకువ‌చ్చి కార్పొరేట్ వ్య‌వ‌స్థ‌పై హైకోర్ట్‌లో పోరాటం చేస్తుంటాడు. ఇదిలావుంటే ఇదే టైమ్‌లో క‌ల‌క‌త్తా సెంట్ర‌ల్ జైల్ నుండి త‌ప్పించుకుంటాడు క‌త్తి శీను (చిరంజీవి). దొంగ‌తనాలు మాత్ర‌మే తెలిసిన శీను హైద‌రాబాద్‌కి వ‌స్తాడు. అనుకోకుండా ఓ రోజు దెబ్బ‌ల‌తో ఉన్న శంక‌ర్‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోతాడు.అచ్చం త‌న‌లాగే ఉన్న శంక‌ర్‌ను హాస్ప‌ట‌ల్ చేర్పించి అక్క‌డ నుండి జారుకుంటాడు. అయితే హాస్ప‌ట‌ల్‌లో ఉండాల్సిన శంక‌ర్ జైలుకు ఎందుకు వెళ‌తాడు, జైలు నుండి వ‌చ్చిన శీను రైతులను ఎందుకు క‌లుస్తాడు.. వారికోసం ఏ విధంగా పోరాటం చేస్తాడు. వారి స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్క‌రిస్తాడు తెలియాలంటే థియేట‌ర్స్‌కు వెళ్ళాల్సిందే.

విశ్లేష‌ణ :

ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే మొద‌ట మెగాస్టార్‌ చిరంజీవి గురించి మాట్లాడుకోవాలి. దాదాపు ప‌దేళ్ల గ్యాప్ త‌ర్వాత ఇండ‌స్ట్రీకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ నేటిత‌రం యంగ్ హీరోల‌కు ధీటుగా న‌టించి అదిరిపోయే షాకిచ్చారు. సినిమాలో మొత్తం వ‌న్ మ్యాన్ షో న‌డిపి బాస్ ఇజ్ బ్యాక్ అనిపించుకున్నారు. ఇక డ్యాన్స్ విష‌యానికొస్తే ఏ మాత్రం ఏజ్ క‌నిపించ‌నువ్వ‌కుండా కుర్ర‌హీరోలు కంగుతినేలా న‌టించారు. ఇక స్టోరీ విష‌యానికొస్తే త‌మిళ మూవి క‌త్తి సినిమాను డైన‌మిక్ ద‌ర్శ‌కుడు వినాయ‌క్ త‌న స్టైల్ డైరెక్ష‌న్ మార్క్‌ని ఉప‌యోగించి సీన్ టు సీన్ దించేశార‌నే చెప్పాలి. రొటీన్ స్టోరీ, తెలిసిన స్టోరీనే అయినా చిరు యాక్టింగ్ క‌థ‌కు కొత్త‌ద‌నాన్ని తీసుకువ‌చ్చింది. ఇక సినిమాలో రాంచ‌ర‌ణ్ ఎంట్రీ థియేట‌ర్స్‌లో ప్రేక్ష‌కుల‌తో విజిల్స్ వేయించింది. ఇక కాజ‌ల్ విష‌యానికొస్తే సుబ్బ‌ల‌క్ష్మీ పాత్ర‌కు అస్స‌లు స్కోప్ లేకుండా పోయింది. కేవ‌లం చిరుతో క‌లిసి స్టెప్పులు వేసేందుకు మాత్ర‌మే కాజ‌ల్ ఉప‌యోగ‌ప‌డింది. ఇక సినిమాటోగ్ర‌ఫీ విష‌యానికొస్తే ర‌త్న‌వేలు పనిత‌నం చాలా చ‌క్క‌గా క‌నిపించింది. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ బాగున్నాయ్‌. గౌత‌మ్ రాజు ఎడిటింగ్ బాగుంది. ఇక బ్ర‌హ్మానందం, ఆలీ, పోసాని త‌దిత‌ర న‌టీన‌టులు త‌మ ప‌రిధిమేర‌కు న‌టించారు.

ప్ల‌స్‌లు :

మెగాస్టార్ చిరంజీవి
స్టోరీ
దేవి మ్యూజిక్‌
టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్‌

మైన‌స్‌లు :

ఫ్లాట్ నెరేష‌న్‌
న‌వ్వు తెప్పించలేని కామెడీ
క‌థ‌కు హైల్ప్‌కాలేక‌పోయిన కొన్ని సీన్స్‌
క‌త్తి స్టోరీని యాజిటీజ్‌గా దించేయ‌టం

రేటింగ్ : 3.5

Share This Article

జ్యోఅచ్యుతానంద మూవీ రివ్యూ

Health

 • jama

  జామ పండ్లు, ఆకులు వ‌ల్ల ఊహించ‌ని ఉప‌యోగాలు ఇవే..

  1 year ago

  ప్ర‌స్తుత రోజుల్లో పెరిగిపోతున్న పొల్యూష‌న్‌తో పాటు సంపాద‌న క్ర‌మంలో చాలా మందికి తిండి తినే టైమ్ కూడా ఉండ‌టం లేదు.. దీనికార‌ణంగా చిన్న వ‌య‌సులోనే లేనిపోని రోగాలతో జీవితాన్ని కోల్పోతున్నారు. దీనంత‌టికి కార‌ణం మ‌నం తినే తిండిలో ...

  Read More
 • ff

  విదేశీప‌ళ్లు తింటే అయిపోయిన‌ట్లే..!

  2 years ago

  ప‌ళ్లు తింటే ఆరోగ్యం చ‌క్క‌గా ఉంటుంది..ఇది తెలియ‌ని విష‌యం కాదు..అయితే ఈ ఆరోగ్యం మ‌రింత చ‌క్క‌గా ఉండాల‌నే ఉద్దేశంతో విదేశీ దిగుమ‌తులుగా వ‌చ్చే ప‌ళ్ల‌ను తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు మ‌న దేశీయులు..విధేశాల నుండి దిగుమ‌తి అయ్యే ...

  Read More
 • nn

  నాచురల్ హెయిర్ కండిష‌న‌ర్‌.

  2 years ago

  ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రిని బాగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య జుట్టు.. ఈ స‌మ‌స్య ఒకొక్క‌రిలో ఒకో విధంగా ఉంటుంది. కొంద‌రికి జుట్టు రాలిపోవ‌టం, కొంద‌రికి ఎక్కువ‌గా చుండ్రు ప‌ట్ట‌టం, మ‌రి కొంద‌రికి జుట్టు డ్రైగా అయిపోవాటం ...

  Read More