HeadLines

crimee
 • Page Views 8272

సినిమాల్లో అవ‌కాశం ఇస్తామ‌ని 17రోజులు రేప్ చేసిన డైరెక్ట‌ర్లు.

రంగుల ప్ర‌పంచంలో త‌న క‌ల‌ల‌కు రంగులు అద్దుకోవాల‌ని ఆశ‌ప‌డ్డ ఓ మైన‌ర్ బాలిక‌కు 17రోజులు న‌ర‌కం చూపించారు ఐదుగురు వ్య‌క్తులు. సినిమాల్లో డ్యాన్సర్‌ గా స్థిరపడాలనే ఉద్దేశంతో 15 సంవత్సరాల బాలిక బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.2 లోని ఇందిరానగర్‌ లో నివాసముండే మేనమామ ఇంటికి వచ్చింది. అదే ఏరియాలో నివాసం ఉంటున్న షేక్‌ అక్బర్‌ (21), తూము వెంకారెడ్డి (22), ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌ గా పని చేస్తున్న నండూరి పాపారావు అలియాస్‌ గణేష్‌ (31) మోయినాబాద్‌ వాసి గుడుపల్లి నవీన్‌ కుమార్‌ (19) ల‌కు విష‌యం తెలియ‌టంతో వారు ఆమెపై క‌న్నేశారు.

                           తాము ఇండ‌స్ట్రీలో ప‌నిచేస్తున్నామ‌ని, పెద్ద పెద్ద వారితో సంబంధాలున్నాయ‌ని ఆమెను న‌మ్మించి ఓ రోజు ఆ బాలిక‌ను ఈ నెల 3వ తేదీన రంగారెడ్డి జిల్లా నందిగామకు తీసుకెళ్లారు. అక్క‌డ ఓ లోక‌ల్ ఫ్రెండ్‌తో క‌లిసి ఆమెపై అత్యాచారానికి తెగ‌బ‌డ్డారు. అప్ప‌ట్నుండి వ‌రుస‌గా ఆ బాలికను ఇందిరానగర్‌ తో పాటు చింతల్, జీడిమెట్ల, నందిగామ తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలా 17 రోజుల పాటు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.వారి క్రూర‌త్వాన్ని భ‌రించ‌లేక‌పోయిన యువ‌తి వారి నుండి త‌ప్పించుకుని బంజారాహిల్స్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. యువ‌తి ఫిర్యాదు ప్ర‌కారం నిందితుల‌ను అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై ఐపీసీ సెక్షన్‌ 376 (డి), సెక్షన్‌ 5 (జి), రెడ్‌ విత్‌ 6, పోక్సో యాక్ట్‌ కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌ కు తరలించారు. సినిమాల్లో పని చేస్తున్న వారంతా పట్టుబడగా, నందిగామలో కలిసిన కుమార్ పరారీలో ఉండడంతో, అతని కోసం గాలింపు చేపట్టారు.

Share This Article

15 ఏళ్ల యువ‌తిపై 3 వారాలు అత్యాచారం.. యువ‌కుడు చేసిన వింత చేష్ట‌లు.

Next Story »

న్యూయ‌ర్ విషాదం.. వారు ఏ ఒక్క అమ్మాయినీ వ‌ద‌ల్లేదు.

Health

 • jama

  జామ పండ్లు, ఆకులు వ‌ల్ల ఊహించ‌ని ఉప‌యోగాలు ఇవే..

  1 year ago

  ప్ర‌స్తుత రోజుల్లో పెరిగిపోతున్న పొల్యూష‌న్‌తో పాటు సంపాద‌న క్ర‌మంలో చాలా మందికి తిండి తినే టైమ్ కూడా ఉండ‌టం లేదు.. దీనికార‌ణంగా చిన్న వ‌య‌సులోనే లేనిపోని రోగాలతో జీవితాన్ని కోల్పోతున్నారు. దీనంత‌టికి కార‌ణం మ‌నం తినే తిండిలో ...

  Read More
 • ff

  విదేశీప‌ళ్లు తింటే అయిపోయిన‌ట్లే..!

  2 years ago

  ప‌ళ్లు తింటే ఆరోగ్యం చ‌క్క‌గా ఉంటుంది..ఇది తెలియ‌ని విష‌యం కాదు..అయితే ఈ ఆరోగ్యం మ‌రింత చ‌క్క‌గా ఉండాల‌నే ఉద్దేశంతో విదేశీ దిగుమ‌తులుగా వ‌చ్చే ప‌ళ్ల‌ను తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు మ‌న దేశీయులు..విధేశాల నుండి దిగుమ‌తి అయ్యే ...

  Read More
 • nn

  నాచురల్ హెయిర్ కండిష‌న‌ర్‌.

  2 years ago

  ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రిని బాగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య జుట్టు.. ఈ స‌మ‌స్య ఒకొక్క‌రిలో ఒకో విధంగా ఉంటుంది. కొంద‌రికి జుట్టు రాలిపోవ‌టం, కొంద‌రికి ఎక్కువ‌గా చుండ్రు ప‌ట్ట‌టం, మ‌రి కొంద‌రికి జుట్టు డ్రైగా అయిపోవాటం ...

  Read More